నామినేషన్ దాఖలు చేసిన హోంమంత్రి తానేటి వనిత

5584చూసినవారు
గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా యర్నగూడెం నుండి భారీ ర్యాలీగా బయల్దేరిన మంత్రి వనిత గోపాలపురంలోని ఎమ్మార్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శివజ్యోతికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆమె భర్త శ్రీనివాస్, వైసీపీ నాయకులు ఇళ్ల భాస్కరరావు, జీవీ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్