తహశీల్దార్ కార్యాలయంలో ఫోటోగ్రాఫర్ల నిరసన

68చూసినవారు
తహశీల్దార్ కార్యాలయంలో ఫోటోగ్రాఫర్ల నిరసన
ఎన్నికల విధులు నిర్వహించిన తమకు సొమ్ములు చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గోపాలపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఫొటోగ్రాఫర్లు నిరసన చేపట్టారు. ఎన్నికలు జరిగి 27 రోజులవుతున్నా ఇప్పటికి మొత్తం సొమ్ము ఇవ్వలేదని ఆరోపించారు. మొత్తం రూ. 25, 98, 750కి గాను, రూ. 6లక్షలే ఇచ్చారని, తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.