జగ్గంపేట: హరిదాసుని సన్మానించిన మర్రిపాక గ్రామస్థులు

55చూసినవారు
జగ్గంపేట: హరిదాసుని సన్మానించిన మర్రిపాక గ్రామస్థులు
జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామస్తులు హరిదాసును శుక్రవారం ఘనంగా సన్మానం చేశారు. ధనుర్మాసం సందర్భంగా హరినామ సంకీర్తనలతో గ్రామంలో తిరిగిన హరిదాసుని గ్రామస్తులు సత్కరించారు. రామ నామ సంకీర్తనలతో దైవభక్తి పెంపొందించిన హరిదాసుని భక్తి భావంతో గ్రామస్థులు సత్కరించారు. భద్రాచలం గ్రామం నుంచి వచ్చి నెల రోజుల పాటు సంకీర్తనలు జరిపిన హరిదాసుని సత్కరించుకోవడం ఆనందదాయకం అని గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్