రాము మరణం తీరని లోటు... పంచాయతీ సిబ్బంది

63చూసినవారు
రాము మరణం తీరని లోటు... పంచాయతీ సిబ్బంది
గోకవరం పంచాయతీ 13వ వార్డు మెంబర్ చింతల రాము ఆకస్మిక మరణం పంచాయతీకి తీరనిలోటని పంచాయతీ ఈవో టంకాల శ్రీనివాస్, సర్పంచ్ కొమరం శ్రావణి, మాజీ ఎంపీటీసీ బుజ్జి తమ సంతాపం తెలియజేశారు. అందరితోనూ సోదరభావంతో మెలిగే రాము ఆకస్మిక మరణం తమనువేదనకు గురిచేసిందని ఆయన ఆత్మకు శాంతికలగాలని రాము చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ఈవోపీఆర్డి రాజేశ్వరరావుతో పాటు, అబ్రహం మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్