దిగ్విజయంగా కొనసాగుతున్న సప్తాహ మహోత్సవం

1064చూసినవారు
దిగ్విజయంగా కొనసాగుతున్న సప్తాహ మహోత్సవం
కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ పట్టాభి సీతారామ స్వామి వారి సప్తాహ మహోత్సవం రెండు సప్తాహాలు దిగ్విజయంగా పూర్తిచేసుకుని మూడవ సప్తాహంలోకి గురువారం ప్రవేశించింది. 49 రోజులపాటు జరగనున్న ఈ సప్తాహ కార్యక్రమంలో అనేక భజన సంఘాలు పాల్గొని ఎంతో ఉత్సాహంగా స్వామివారికి భజన గీతాలను ఆలపిస్తూ గ్రామస్తులను ఆకట్టుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్