మట్టి వినాయకులను పూజించాలని కాకినాడ జెఎన్టియుకె ఇన్చార్జ్ విసి డి వి ఎస్ కే మురళీకృష్ణ, ధరిత్రి రక్షిత సమితి కాకినాడ అధ్యక్షురాలు సురేఖ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ భానుగుడి సెంటర్లో ధరిత్రి రక్షిత సమితి కాకినాడ, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కాకినాడ ఆధ్వర్యంలోఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో విసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.