రెడ్ క్రాస్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు రాష్ట్రంలోనే కాక దేశంలోనే కీర్తి ప్రతిష్టలు పొందడం అభినందనీయమని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా శాఖ అధ్యక్షులు షన్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. మొదటి సారిగా రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. సంస్థ చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకున్నారు. సంస్థ చైర్మన్ వై డి రామారావు తదితరులు పాల్గొన్నారు.