జాతీయ న్యాయ సేవాధికార సంస్థ గోడ పత్రికను గురువారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ , కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు ఎస్. మల్లి బాబు, కె. శ్రీరమణిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో అందరికీ న్యాయపరమైన సూచనలు, సలహాలు అందుబాటులో ఉండే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు.