ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజలు అందజేసే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, అలాగే ఫిర్యాదులపై క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కాకినాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్)పై సమీక్షించారు. ముఖ్యంగా గ్రీవెన్స్ పోర్టల్‌ను అన్ని విభాగాల అధికారులు కచ్చితంగా పరిశీలించాలని సూచించారు.