ఘనంగా చంద్రశేఖర్ ఆజాద్ జయంతి

1742చూసినవారు
ఘనంగా చంద్రశేఖర్ ఆజాద్ జయంతి
సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో చంద్రశేఖర్ ఆజాద్ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాది కొమ్మూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ 19o6 జూలై 23న ఉత్తరప్రదేశ్లో జన్మించిన ఆజాద్ భారత స్వాతంత్ర పోరాటంలో యువకుల తెగువను ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. నాయకుడిలా కాకుండా ఓ సేవకుడిలా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. స్వాతంత్రం అంటే ఆత్మ గౌరవం అని నిరూపించారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్