స్మార్ట్ సిటీ కాకినాడను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత నగర ప్రజలందరిపైనా ఉందని, పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కమిషనర్ భావన అన్నారు. పారిశుద్ధ్య తనిఖీల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామునే కమిషనర్ భావన నగరంలో పర్యటించారు. పలు డివిజన్లలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. రహదారులను శుభ్రపరచడం, డ్రైనేజీలలో చెత్త తొలగింపు, చెత్త సేకరణ జరుగుతున్న తీరును గమనించారు.