ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జయకేతనం సభ కోసం శుక్రవారం చిత్రాడ వచ్చిన విషయం తెలిసిందే. రాత్రి కాకినాడలో బస చేసిన అయన శనివారం ఉదయం తిరిగి మంగళగిరి బయలుదేరారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్న హెలిపాడ్ కు తాను బస చేసిన హోటల్ నుంచి వెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో మంగళగిరి బయలుదేరారు. జీఆర్టీ జనరల్ మేనేజర్ శివకుమార్ బృందానికి డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు.