జనసేన జయకేతనం సభకు కేవలం పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఎమ్మెల్యేల, మంత్రులు, వీఐపీలు, కార్యకర్తలు, మీడియా ఇలా ఎవరైనా సరే పాస్ ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద పోలీసులు పాసు తనిఖీ చేసి ఆయా మార్గాలలో వారికి ఏర్పాటు చేసిన గ్యాలరీ వద్దకు పంపుతున్నారు. పాసులు లేక చాలామంది నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు. పోలీసు తనిఖీలు విస్తృత స్థాయిలో ఉన్నాయి.