దైవ సంకల్పం లేనిదే మానవ ప్రయత్నాలు విజయవంతం కావని, తనవంతుగా అమ్మవారికి ఇలా కిరీటం ఇవ్వడం తన అదృష్టమని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి తెలిపారు. ఆదివారం సాయంత్రం వాకలపూడి గ్రామంలో వెలిసిన శ్రీ గంగాలమ్మ అమ్మవారికి రూ. 6 లక్షల విలువైన 4. 5కేజీ ల వెండి కిరీటం, చెవి కమ్మలు మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి దంపతులు, ఆలయ కమిటీ సమక్షంలో కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారికి అలంకరించారు.