కాకినాడ పోర్టు నుండి ఫిలిప్పీన్ దేశానికి నౌక ద్వారా బియ్యం రవాణాను చేయడం జరుగుతుందని తెలంగాణ జల వనరులు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తం కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ లో కాకినాడ పోర్టు నుంచి నౌకకు సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాకినాడ పోర్టు నుండి ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం రవాణా చేసే ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు.