ఆలమూరు: ఈనెల 21 నుంచి పశు ఆరోగ్య శిబిరాలు

54చూసినవారు
ఆలమూరు: ఈనెల 21 నుంచి పశు ఆరోగ్య శిబిరాలు
పశుసంవర్ధక శాఖ ఆదేశాల ప్రకారం ఆలమూరు మండలంలోని ప్రతి గ్రామంలో ఈనెల 21వ తేదీ మంగళవారం నుంచి పశుఆరోగ్య శిబిరాలు నిర్వహించ నున్నట్లు ఆలమూరు పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డా. ఎల్. అనిత తెలియ జేశారు. ఈ పశువైద్య శిబిరాల్లో ఆవులు, గేదెలతో పాటు గొర్రెలు, మేకలు, దూడలకు నట్టల నివారణ మందులు వేయ నున్నారు. పశువులకు కృత్రిమ గర్భధారణ, చూడి పరీక్షలు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్