మడికిలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం

76చూసినవారు
మడికిలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నేషనల్ హైవే పక్కన మడికి గ్రామంలో సోమవారం హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి ఆలమూరు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. హెల్మెట్ల యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ భద్రత దృష్ట్యా విధిగా హెల్మెట్ ను ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు ఎస్సై, ఏఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్