ప్రజల భూ సమస్యలు పరిష్కరం ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం ఖండ్రిగ గ్రామంలో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ భూములు కబ్జా గాని లేదా సమస్యలు గానీ ఎదురైతే వారిని పరిష్కరించడం కోసమే ఈ రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.