సంక్రాంతి ప్రభల ఉత్సవాల సందర్భంగా కొత్తపేటలో14, 15 తేదీల్లో ట్రాఫిక్ ను మళ్ళించినట్లు ఎస్సై జి. సురేంద్ర తెలిపారు. రావుల పాలెం వైపు నుండి అమలాపురం వెళ్లే వాహనాలన్నీ బోడి పాలెం వంతెన నుండి వాడపాలెం, అయినవిల్లి, ముక్తేశ్వరం, మీదుగా అమలాపురం వెళ్ళాలి. అదేవిధంగా అమలాపురం నుండి రావులపాలెంవెళ్లే వాహనాలు పలివెల వంతెన నుండి పలివెల, గంటి మీదుగా ఈతకోట వెళ్లాలన్నారు. ప్రయాణికులందరూ సహకరించాలని కోరారు.