తాళ్లపూడి గ్రామంలోని స్థానిక జడ్పీ హైస్కూల్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ రవీంద్రనాథ్ చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం సహాయ గణాంక అధికారి వెంకటేశ్వరరావుతో కలిసి కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొత్తం 41 మంది టీచర్లు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారని అన్నారు.