నిరుద్యోగ యువతకు ఈ 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో కూటమి పని చేస్తుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు బుధవారం చెప్పారు. కొవ్వూరు ఏబీఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 21న ఏబీఎన్ కాలేజీలో మెగా జాబ్ మేళా జరుగుతుందన్నారు. దాదాపు 34 కంపెనీలు పాల్గొంటాయని అందరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.