సమాజంలో మేకవన్నె పులులున్నాయి వారి పట్ల బాలికలు జాగ్రత్తగా ఉండి స్వీయ నియంత్రణ పాటించేందుకు సిద్ధంగా ఉండాలని ఆలమూరు ఎస్సై శ్రీనివాస నాయక్, ఉమెన్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ న్యాయవాది, ఆలమూరు బార్ అసోసియేషన్ ట్రెజరర్ బూసి విద్యా ప్రసన్న అన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు శ్రీ బొబ్బా జయశ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు అధ్యక్షతన అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరిగింది.