కపిలేశ్వరపురం గ్రామ శివారు సత్యనారాయణపురం లో అగ్ని కులక్షత్రియులు నూతనంగా నిర్మించబడిన శ్రీ వీరా ఆంజనేయ, సిద్దివినాయక, శ్రీ రామమందిర నూతన శిఖర ప్రతిష్ఠ మహోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఉత్సవ కమిటీ వారు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ అన్నసమారాధన నిర్వహించారు.