కోరుమిల్లి గ్రామాన్ని సంపూర్ణ సారా రహిత గ్రామంగా చేయాలి

82చూసినవారు
కోరుమిల్లి పంచాయతీ వద్ద ప్రోహిబిషన్ అండ్ ఎక్సయిజ్ జిల్లా సూపరిండెంట్ ఎస్ కే డి వి ప్రసాద్ ఆద్వర్యంలో నవోదయ 2. 0 కార్యక్రమం గురువారం నిర్వహించారు. మాట్లాడుతూ కోరుమిల్లి గ్రామం నాటు సారా విక్రయంలో బి గ్రేడ్ గా వుందని, గ్రామస్తులు సహకారంతో సంపూర్ణ సారా రహిత గ్రామంగా తీర్చాలని అన్నారు. గంజాయి, నాటు సారా తయారీ, విక్రయం, రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి సమాచారం తెలిస్తే 14405 నంబర్ కి ఫోన్ చెయ్యాలని అన్నారు.

సంబంధిత పోస్ట్