మండపేట: పేరంటాలమ్మ తల్లికి మున్సిపల్ చైర్మన్ దుర్గారాణి పూజలు

63చూసినవారు
మండపేట: పేరంటాలమ్మ తల్లికి మున్సిపల్ చైర్మన్ దుర్గారాణి పూజలు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ఏడిద రోడ్డులో వేంచేసి యున్న శ్రీ పాపమ్మ పేరంటాలమ్మ తల్లి అమ్మవారిని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి సోమవారం దర్శించుకుని విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేరంటాలమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు యరమాటి వెంకన్నబాబు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్