అధికార పార్టీ అండదండలతోటే మండపేటలో రేవ్ పార్టీ జరిగిందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. మండపేట లోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. గత వైసిపి పాలనలో జిల్లాలో ఎప్పుడు ఇటువంటి విష సంస్కృతి జరగలేదన్నారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేయటం సిగ్గుచేటు అన్నారు. సంబంధిత శాఖ అధికారులు ఎవరి కను సన్నాల్లో పనిచేస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు.