క్రీడలు మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయని ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. కేశవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉగాది సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు ముక్కపాటి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వాలీబాల్ క్రీడోత్సవంలో పది జుట్టు పాల్లొన్నాయి. ఈ పోటీల్లో కర్ణాటక జట్టు విజేతలుగా నిలిచింది. కడగల హేమంత్ జుట్టు రన్నర్ గా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.