మండపేటలో నిర్వహించిన అశ్లీల నృత్య ప్రదర్శన కేసులో పది మందిని అరెస్టు చేసినట్లు మండపేట ఇన్చార్జి టౌన్ సీఐ పి. దొర రాజు తెలిపారు. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో టౌన్ ఎస్. ఐ హరికోటి శాస్త్రి తో కలిసి శుక్రవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత నెల 31న రాత్రి గొల్లపుంత రోడ్డు లోని ఒక లేఔట్ లో ఈ అశ్లీల నృత్య ప్రదర్శన నిర్వహించినట్లు తెలిపారు.