కూటమి ప్రభుత్వ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకునేందుకు భరోసా లభించినట్లు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వర రావు తెలిపారు. మండపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రకే గాక యావత్తు ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ ఉక్కు కర్మాగారామన్నారు.