ద్వారపూడిలో రంజాన్ వేడుకలు

76చూసినవారు
ద్వారపూడిలో రంజాన్ వేడుకలు
మండపేట మండలం ద్వారపూడిలో సోమవారం రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మసీద్ ఇమామ్ కరీముల్లా మాట్లాడుతూ.. ప్రతి ముస్లిం తన జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకునేందుకు రంజాన్ దీక్షలు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. సమాజంలో వున్న ఆర్థిక అసమానతలు తొలగించేందుకు మహనీయ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జకాత్ విధి దానం తప్పనిసరిగా పాటించాలని బోధించారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్