అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం చింతపల్లిలంకలో బుధవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మూడు తాటాకు ఇళ్లు దగ్ధమైయ్యాయి. దీంతో నాలుగు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనలో రూ.5 లక్షల మేరకు ఆస్థి నష్టం జరిగిందని తెలిపారు.