అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశానికి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు హాజరయ్యారు. సమావేశానికి ముందు ఆయన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో అధికారులతో సమీక్షించారు. అదేవిధంగా విజన్ 2047 గోడ పత్రికలను ఆవిష్కరించారు.