మురముళ్ల: వీరేశ్వర స్వామి ఆన్ లైన్ కల్యాణాల కోటా విడుదల

74చూసినవారు
మురముళ్ల: వీరేశ్వర స్వామి ఆన్ లైన్ కల్యాణాల కోటా విడుదల
నిత్య కళ్యాణం, పచ్చ తోరణంగా విరాజిల్లుతున్న ఐ. పోలవరం మండలం మురమళ్ళ శ్రీవీరేశ్వర స్వామి వారి నవంబర్ నెల ఆన్లైన్ కల్యాణాల కోటాను విడుదల చేశారు. ఈ వివరాలను ఆలయ ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ సోమవారం తెలిపారు. అశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక బహుళ చతుర్దశి వరకు కల్యాణాల కోటాను విడుదల చేశామన్నారు. నిత్య కళ్యాణం, నిత్య, మాస వార్షిక పూజలు, అన్నదానం విరాళాల కోసం సంప్రదించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్