మద్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రాహుల్ దేవ్ శర్మ పేర్కొన్నారు. ఎక్సైజ్ కమిషనర్ రేణుకతో కలిసి యానాం సరిహద్దులో ఉన్న చెక్ పోస్టులను ఆయన గురువారం పరిశీలించారు. అక్రమ మద్యం రవాణా అరికట్టడానికి పోలీసులతో కలిసి ఎక్సైజ్ సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ఎదుర్లంక చెక్ పోస్టు వద్ద వాహనాల చెకింగ్ ను పరిశీలించారు. నిరంతర నిఘాతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు.