ప్రకృతి వ్యవసాయ విస్తరణకు డ్రోన్‌ను వాడాలని అధికారులు సూచించారు. బుధవారం నిడదవోలు మండలం కోరుమామిడిలో ప్రకృతి వ్యవసాయ కషాయాలను, ద్రావణాలను వరి పంటలపై డ్రోన్ సాయంతో పిచికారి చేయించారు. వరి పంటలపై పురుగులు, తెగులు నియంత్రణకు వేప గింజల ఇంగువ, కుంకుడు చాప, బెల్లం కషాయాలను వినియోగించారు.