విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తూగో జిల్లా నిడదవోలుకు చెందిన అతుకూరి సాయి మణి దీప్ (24) ఆదివారం సూసైడ్ నోట్ రాసి తన హాస్టల్ గదిలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత పరీక్షల్లో సబ్జెక్టులు ఉండిపోవడంతో మనస్థాపంకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.