నిడదవోలు పట్టణ టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొమ్మిన వెంకటేశ్వరరావును నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.