కాకినాడ: ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ

79చూసినవారు
కాకినాడ: ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. కత్తులతో దాడి చేసిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ స్థాపనకు సంబంధించిన వివాదం ఈ ఘర్షణకు కారణమైంది. కరాదాల ప్రకాశావు (50), చంద్రరావు (60), ఏసు ఆసుపత్రిలో మృతి చెందారు. గాయపడ్డ వారు చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్