తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో స్థానిక సత్యన్నారాయణపురంలోని మాజేటి నగర్ కాలనీ ప్రజల కోరిక మేరకు 23వ వార్డులో దాత, మున్సిపల్ కౌన్సిలర్ చాంబరు మాజీ అధ్యక్షులు డాక్టర గొరకపూడి చిన్నయ్య దొర ఆధ్వర్యంలో గ్రావెల్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. ఇటీవల వర్షాలకు మాజేటి నగర్ కు వెళ్లే రహదారి పూర్తిగా శిథిలమై ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రజలు మున్సిపల్ అధికారులను రహదారి బాగు చేయాలని ఎన్నిసార్లు కోరిన రహదారి నిర్మాణాన్ని చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో గోరకపూడి చిన్నయ్య దొర ముందుకు వచ్చి ఆయన సొంత నిధులతో కాలనీకి తాత్కాలిక గ్రావెల్ రోడ్డు నిర్మాణాన్ని ఆదివారం చేపట్టారు. దాత డా. చిన్నయ్య దొర రహదారి పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా పరిషత్ నాయకులు పదాల చిట్టిబాబు, పడాల వీరబాబు, వర్రే గోవి, కాళ్ళ గోవించు,
కాలనీ వాసులు రెడ్డి బుల్లి వెంకటేశ్వర్రావు, ముత్యాల సాయి, దూలం రామ్ ప్రసాద్, యండమూరి గొల్లబ్బాయి, ఎండి హుస్సేన్, జార్జ్ బర్నబస్,
ఎస్ వెంకట్, పివి రమణ, కాకర్లపల్లి కొండ, తదితరులు పాల్గొన్నారు.