పెద్దాపురం: పార్టీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి
టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదులను క్షేత్ర స్థాయిలో వేగవంతం చేయడంతో పాటు అధిక సంఖ్యలో నమోదు పూర్తి చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్ మరియు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరి బాబు రాజు పేర్కొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే చినరాజప్ప సూచనలతో శనివారం పెద్దాపురంలో రాజా సూరి బాబు రాజు స్వగృహంలో నియోజక వర్గ స్థాయిలో పార్టీ క్లస్టర్ సమావేశం నిర్వహించారు.