గొల్లప్రోలు మండలం చెందుర్తిలో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం రసాభాసగా మారింది. ఈకార్యక్రమానికి టీడీపీఇన్ఛార్జ్ వర్మను ఆహ్వానించకపోవడంపై ఆయన అనచరులు ఆగ్రహించారు. అక్కడికి వచ్చిన జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం చెలరేగింది. గందరగోళం నెలకొనడంతో మర్రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పొత్తుధర్మాన్ని పాటించడం లేదని వర్మ అనుచరులు మండిపడ్డారు.