జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ, నీటి సరఫరా మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఓటును అభ్యర్థించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరంకి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో యువత భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం మొదటి ప్రాధాన్యత ఓటువేసి భారీ మెజారిటీతో ఆయనను గెలిపించమని పవన్ కళ్యాణ్ కోరారు.