జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఏపీ అని జనసేన జయకేతనం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కరెంట్ షాక్ తగిలి చనిపోయే స్థితిలో ఉన్న తనను కొండగట్టు అంజన్న దయ, తెలంగాణ అన్నదమ్ముల దీవెనలు పునర్జన్మ నిచ్చాయన్నారు. అలాంటి నా తెలంగాణ నేల తల్లికి హృదయపూర్వక వందనాలు తెలిపారు. పాటనే ఆయుధంగా మలచిన వాడు, ఎలా ఉన్నావు తమ్ముడూ అని ఆప్యాయంగా పలకరించిన గద్దరన్నను గుర్తుచేసుకుంటున్నానని శుక్రవారం పేర్కొన్నారు.