విద్యార్థి దశ నుంచి క్రీడల్లో ఆసక్తి పెంచే లక్ష్యంతో పిఠాపురం నియోజకవర్గాల్లోని పాఠశాలలకు క్రీడా సామగ్రి కిట్లు అందజేయాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీసుకున్న చొరవతో త్వరలో పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్లు అందనున్నాయి. విద్యాబోధనతోపాటు క్రీడలకు ఉన్న సౌకర్యాలపై ఇటీవల పవన్‌కల్యాణ్ ఆరా తీశారు. నియోజకవర్గంలోని 32 ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు, క్రీడాసామగ్రి కిట్లు సమకూర్చాలని నిర్ణయించారు.