ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మరికొద్దిరోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంతో లోకల్ యాప్ ఎక్స్ క్లూజివ్ స్టోరీ నిర్వహించింది. తనను ఎమ్మెల్సీగా గెలిపించి శాసనమండలికి పంపితే నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిపిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మెగా డిఎస్సీకి కట్టుబడి ఉన్నామన్నారు.