పిఠాపురం సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ కు వినతి

77చూసినవారు
పిఠాపురం సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ కు వినతి
పిఠాపురం సమస్యలను పరిష్కరించాలంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలిని గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పిఠాపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తే అధినేత కార్యక్రమం నిర్వహించామని వాటిలో సమస్యలను వినతిపత్రం ద్వారా అందజేయడం జరిగిందని వర్మ తెలియజేశారు. వైసీపీ హయాంలో టీడీపీపార్టీ నాయకులపై పెట్టిన కేసులు సంబంధించిన అర్జీలు 102 వచ్చాయని వర్మ అన్నారు.

సంబంధిత పోస్ట్