భారత 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలేశ్వరంమండలంలో వాడవాడల మువ్వన్నెల జండాలను శుక్రవారం ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ అలమండ సత్యవతి, ఎర్రవరంలో జెడ్పిటిసి నీరుకొండ రామకుమారి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పథకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కే శ్రీనివాసరావు, గ్రామ కార్యదర్శులు సిబ్బంది ఉన్నారు.