ఏలేశ్వరం మండలం పెద్దనపల్లిలో ఉన్న ఓ ప్రాజెక్ట్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికురాలు గురువారం మృతి చెందింది. ప్రత్తిపాడు మండలం ఏలూరుకి చెందిన జామి మహాలక్ష్మి (32) ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఊపిరి ఆడక అపస్మారక స్థితికి వెళ్లి మరణించినట్లు గ్రామస్థులు తెలిపారు. యాజమాన్యం పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలంటూ రాత్రి మృతదేహంతో గ్రామస్థులు కంపెనీ ఎదుట అర్ధరాత్రి ధర్నా చేపట్టారు.