గుంటూరు ఛానల్ ను అభివృద్ధి చేయాలని కలెక్టర్ కు వినతి..
గుంటూరు ఛానల్ పొడిగించి రైతులను ఆదుకోవాలని సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమస్యల పరిష్కార వేదికకు నల్లమడ రైతు సంఘం నాయకులు కలెక్టర్ నాగలక్ష్మి కి వినతి పత్రం అందించారు. నల్లమడ రైతు సంఘం నాయకులు డా. కొల్లా రాజమోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వాలు అన్నీ నల్లమడ రైతులను దారుణంగా మోసం చేస్తున్నాయని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని కోరారు.