జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని 'ఓటింగ్ లాగా ఏమీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను' అనే అంశంపై విద్యార్థులకి వ్యాస రచన, వక్తృత్వ పోటీలు రాజమండ్రి వేదికగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతిశనివారం తెలిపారు. వ్యాస రచన విభాగంలో కె. హాసిని, ఎం. వెంకట రేణుక, బి. సాయి శ్రీనిజ మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు.